Motorola Edge 60 Fusion: ప్రీమియం ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ భారత్ మార్కెట్లోకి.. లాంఛ్ డేట్ ఎప్పుడంటే.? 6 d ago

featured-image

మోటరోలా నాణ్యమైన ఫోన్లకు ప్రసిద్ధమైన కంపెనీ. మోటరోలా ఫోన్లు సాధారణంగా మంచి పనితీరు..అద్భుతమైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ను కలిగి ఉంటాయి. మోటో ఫోన్లలో పెద్దగా చెప్పుకోతగ్గ లోపాలు కూడా ఉండవు. మోటరోలాలోని "ఎడ్జ్ సిరీస్" ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. గతంలో వచ్చిన ఎడ్జ్ ఫోన్లు మంచి డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కూడా ఈ సిరీస్ లో మరో అద్భుతమైన మోడల్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. "Motorola Edge 60 Fusion" పేరుతో ఈ కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. గత ఎడ్జ్ సిరీస్ మోడళ్లతో పోలిస్తే దీని ఫీచర్లు చాలా మెరుగైనవి అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక బలమైన పోటీదారుగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఈ మోడల్ ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.!


Motorola Edge 60 Fusion ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.7 అంగుళాలు Curved AMOLED

రిఫ్రెష్ రేట్: 120 Hz

పీక్ బ్రైట్‌నెస్: 4500 nits

ప్రాసెసర్: MediaTek Dimensity 7400

ఆపరేటింగ్ సిస్టమ్: Android v15

బ్యాటరీ: 5500 mAh

ఛార్జింగ్: 68W Turbo Power ఛార్జింగ్

కెమెరా ఫీచర్లు:

బ్యాక్ కెమెరా: 50 MP మెయిన్ కెమెరా

13 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 32 MP 


కనెక్టివిటీ:

  • 5G, 4G సింగిల్ సిమ్
  • Wi-Fi 6E
  • USB టైప్-C


కలర్ ఆప్షన్స్:

  • లైట్ బ్లూ
  • సాల్మన్ (లైట్ పింక్)
  • లావెండర్ (లైట్ పర్పుల్)


డ్యూరబిలిటీ: IP68, IP69 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ ప్రూఫ్, MIL-STD-810 military-grade certification.


సెన్సార్లు: ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ సెన్సార్.


Edge 60 Fusion పూర్తి వివరాలు కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొన్ని లీక్స్ ద్వారా ఇది ఏప్రిల్ 2న భారతదేశంలో లాంఛ్ అవుతుందని.. ఏప్రిల్ 9న సేల్స్​ ప్రారంభం కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 256GB కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 1 TB వరుకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ధర సుమారు రూ.35 వేల లోపు ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ సేల్ మొదటగా ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభం కానుంది.



ఇది చదవండి: "Realme 14 Pro+" ఇప్పుడు కొత్త వేరియంట్ తో.. ఎక్కువ స్టోరేజ్!

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD